పార్టీ బలోపేతానికి, అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని కార్తీక్ వెల్లడి
జనగామ జిల్లా మండలం ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన ఏడెల్లి కార్తీక్ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ () ఎస్సీ డిపార్ట్మెంట్ జనగామ జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు జనగామ డీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ వేముల మల్లేష్ మహారాజ్ ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. తన నియామకం పట్ల కార్తీక్ హర్షం వ్యక్తం చేస్తూ, ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏడెల్లి కార్తీక్ మాట్లాడుతూ... సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న తన సేవలను గుర్తించి, జిల్లా స్థాయిలో నూతన బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని అన్నారు. తన నియామకానికి సహకరించిన డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్, స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ వేముల మల్లేష్ మహారాజ్తో పాటు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, సహచర కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరేలా క్షేత్రస్థాయిలో కృషి చేస్తానని కార్తీక్ తెలిపారు. జిల్లాలో ఎస్సీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటానని, గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఏడెల్లి కార్తీక్ జిల్లా కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా పలువురు మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.











