మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగా సుంకరి అనిల్ కుమార్ నియమితులయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఆయన నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సుంకరి అనిల్ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి, మండల కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, రాహుల్ గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ సేవాదళ్ను బలోపేతం చేయడంతో పాటు పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. సుంకరి అనిల్ కుమార్ నియామకం పట్ల మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.