నర్మెట పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పెండ్యాల దేవేందర్, ఎస్సై చాగర్ల రఘుపతిని స్థానిక నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధికారులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
నర్మెట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సీఐ పెండ్యాల దేవేందర్, నర్మెట ఎస్సైగా చాగర్ల రఘుపతి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో, స్థానిక నాయకులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధికారులకు శాలువాలు కప్పి, ఘనంగా ఆహ్వానించారు. పోలీస్ శాఖలో నూతనంగా వచ్చిన అధికారులకు తమ మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతకింది సురేష్, సర్పంచ్ ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు ఆమెడపు కమలాకర్రెడ్డి, వీ జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్ రెడ్డి, నర్మెట గ్రామ అధ్యక్షుడు నక్కల రవి, వార్డు సభ్యుడు పొన్నబోయిన బాలకృష్ణ, ముక్కెర రాజు, పోతిరెడ్డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.












