- మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దే సిద్దిలింగం
పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకున్నప్పుడు వారికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తామని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్డే సిద్ధిలింగం అన్నారు. శాసనసభ్యుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు, పెదరామచర్ల గ్రామ శాఖ అధ్యక్షుడు కల్లెపు రాజు తండ్రి మరణవార్త తెలుసుకున్న మండల కమిటీ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి భౌతికకాయానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా బాల్డే సిద్ధిలింగం మాట్లాడుతూ, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తల కుటుంబాలతో నాయకులకు విడదీయలేని అనుబంధం ఉంటుందని పేర్కొన్నారు. కల్లెపు రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భైరగొని యాదగిరి, జిల్లా యువజన నాయకుడు కొమ్ము రాజు, ఇరుగు సిద్ధులు, పుల్లే నరేందర్, రోడ్డ జయానందం, ఉడుత రాజు, బిసు దిలీప్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


