కాకినాడ జిల్లా మండలం సంపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి. చిన్నారి పదో తరగతిలో 600 మార్కులకు 596 మార్కులు సాధించి అరుదైన ప్రతిభ కనబరిచారు. ఆమె విజయాన్ని అభినందిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, కాకినాడ జిల్లా మండలం సంపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని డి. చిన్నారి పదో తరగతి పరీక్షలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఆమె 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి అందరి మన్ననలు పొందారు. విద్యార్థిని సాధించిన ఈ ఘన విజయాన్ని ప్రత్యేకంగా అభినందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, ఆమెను మరింత ప్రోత్సహించేందుకు ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా చిన్నారి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యారంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.












