ఓరుగల్లు న్యూస్ (ఓరుగల్లు న్యూస్) జూలై 20
తెలంణ్జల,కొమెల్లిభక్తలసెల్థంఈనెలతెలదీనకొమెల్లిైల్ెలస్టెలషన్నకెలంద్మంత్ి్యలకిషన్ెడ్డి్ంభించనన్ననిబిజెిజిల్లఅధ్యక్షడసౌడమెలష్తెలి.న్మెట్టమండలకెలంద్ంలుయదసంఘంఅధ్యక్షలకన్నెబుయినట్టయ్యనఆహ్నించినసంద్భంఆయనఈిషయలెల్లడించ.
తెలంగాణ ప్రజలు, కొమురవెల్లి భక్తుల సేవార్థం ఈ నెల 26వ తేదీన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ తెలిపారు.
నర్మెట్ట మండల కేంద్రంలో యాదవ సంఘం అధ్యక్షులు కన్నెబోయిన గట్టయ్యను ఆహ్వానించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా కొమురవెల్లి భక్తులు రైలు మార్గం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల నిధులతో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టిందని రమేష్ పేర్కొన్నారు.
ఈ రైల్వే స్టేషన్ నిర్మాణానికి తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ ఘనత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల పెద్దలు, ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్, మండల కన్వీనర్ సొక్కం అనిల్ కుమార్, మండల యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి మహేందర్, ఆగపేట యాదవ సంఘం అధ్యక్షులు కూకట్ల ఉప్పలయ్య, బిజెపి మండల ఉపాధ్యక్షులు మెతుకు సిద్ధులు, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి పులి కపిల్, మన్ బూత్ అధ్యక్షులు ఆనందాస్ నాగరాజు, వెంకటేశ్వర టెంపుల్ అధ్యక్షులు గోపగోని సతీష్, యాదవ సంఘం నాయకులు కన్నెబోయిన కుమార్ తదితరులు పాల్గొన్నారు.








