జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని ఎం.పి.పి.ఎస్ బొమ్మకూరు పాఠశాలలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం (PTM) జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు శాతం పెంపు, మరియు FA-4 పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెరుగు రామరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ మలోత్ బుజ్జమ్మ, ఉపసర్పంచ్ శ్రావణ్, గ్రామ కార్యదర్శి సుజాత, ఉపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది, గ్రామ పెద్దలు, ఆరోగ్య కార్యకర్తలు మరియు తల్లిదండ్రులు హాజరయ్యారు.
ప్రతిభా పాఠవ పోటీలలో విజేతలైన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఇంటి వద్ద తల్లిదండ్రులు చేపట్టాల్సిన చర్యలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లలతో బోర్డులు చదివించడం, కథలు చెప్పించడం, వస్తువులను లెక్కపెట్టించడం వంటి కార్యకలాపాల ప్రాముఖ్యతను వివరించారు.
పాఠశాల ఆవరణలోని అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్య లక్ష్మీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అంగన్వాడి సిబ్బంది తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ, ఆనందకరమైన అభ్యాస వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.








