నర్మెట్ట, జూలై 1
నరమెట మంలంలోనుక్ట్ హానమంతాపూర శుక్ట్ార ొలగతంాలో బారం ఘోర రో పరమాం జరుక్ట్గుక్ట్ంుక్ట్. బుక్టన కార ఢీకొనన ఘటనలో తేజాత హేమలనాయక (55) అనే మతుక్ట్ చెంా. ఈ టంఘటనపై ఎటటై నైనాల నాగేష ుక్ట్రాల ెలలుక్ట్ంచార.
బైక్ను కారు ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాదం మండలంలోని హాన్మంతాపూర్ శివారు దొడ్లగడ్డతండాలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై నైనాల నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హాన్మంతాపూర్ గ్రామానికి చెందిన తేజావత్ హేమ్లనాయక్ (55) దొడ్లగడ్డతండాలో బైక్పై వెళ్తుండగా, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ గ్రామానికి చెందిన రాపాక రాజు తన కారులో జనగామ నుండి వస్తూ బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న హేమ్లానాయక్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితుడిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.







