నర్మెట్ట, జూలై 2
నమట మంల తాజా మాజీ ఎంపీపీ తేజావత గోవధన నాయక తం తేజావత హేమలానాయక (55) బుధవాం ోు పమాదంలో మృత చందాు. ఈ నేపథయంలో గుువాం జనగామ ఎమమలయే ా. పలలా ాజేశవ మృతు సవగామం దొలగతంాకు చేుకొన, నవాళులపంచ, కుటుంబ సభయులకు పగాఢ సానుభూత తలపాు.
నర్మెట మండల తాజా మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్ తండ్రి తేజావత్ హేమ్లానాయక్ (55) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదంతో గురువారం జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీపీ స్వగ్రామం హాన్మంతాపూర్ గ్రామం దొడ్లగడ్డతండాకు చేరుకున్నారు. మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతిమయాత్రలో పాల్గొని, పాడె మోసి, దహన సంస్కరణ పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు.
అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేష్, గద్దల నర్సింగరావు, పెద్ది రాజిరెడ్డి, ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి, బాల్నె సిద్దిలింగం, బద్దిపడిగె కృష్ణారెడ్డి, గంగం సతీష్ రెడ్డి, బూరెడ్డి ప్రమోద్ రెడ్డి, వివిధ గ్రామాల అధ్యక్షులు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు నివాళులు అర్పించారు.











