తరిగొప్పుల, జూలై 2
గొుగోవయువళోఏటుచేసససకెెుచేయకోవైబఆఎసటఅకచువేుగవవశుగుచు..భదకోసఏటుచేసఘకెెుచెోయచకై,వటుైఅకుుకషయగవయవహసుఆోచు..
గ్రామంలో వ్యాపారుల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం పనిచేయక మూగబోయాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి చిలువేరు లింగం విమర్శించారు.
భద్రత కోసం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు చెడిపోయి చాలా కాలం గడిచినా, వాటి మరమ్మతులపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో భద్రతా వ్యవస్థ బలహీనపడిందన్నారు.
గతంలో వ్యాపారుల నుంచి నిధులు సేకరించి ఏర్పాటు చేసిన కెమెరాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారడం బాధాకరమని పేర్కొన్నారు. గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాడైన సీసీ కెమెరాలను వెంటనే మరమ్మతు చేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో కొత్త నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని చిలువేరు లింగం సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. గ్రామ భద్రత విషయంలో అధికారులు తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.












