జనగామ నియోజకవర్గంలోని హన్మంతపూర్ గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద బాధితుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. 1,50,000 ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బాధిత కుటుంబానికి అందజేశారు.
నర్మెట్ట మండలం, హన్మంతపూర్ గ్రామానికి చెందిన శనిగరం మల్లేశం అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మల్లేశం కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచారు.
విషయం తెలిసిన వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాల మేరకు CMRF ద్వారా రూ. 1,50,000 మంజూరు చేయబడింది.
మంజూరు పత్రాన్ని నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, స్థానిక నాయకులతో కలిసి హన్మంతపూర్ గ్రామంలోని మల్లేశం కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన వారికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.












