నర్మెట్ట మండలం, కన్నెబోయినగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త కంతి ప్రవీణ్‌ను సమాజంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను ప్రతిష్టాత్మక 'దళిత రత్న' అవార్డుకు ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహానీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ డా. అల్లిబిల్లి మహేందర్ అందజేశారు.
సమాజంలో పేదలు, నిస్సహాయులు, అనాథలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం, దళితుల హక్కుల కోసం, విద్య కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం కంతి ప్రవీణ్ చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ డా. అలిబిల్లి మహేందర్ తెలిపారు. ఈ అవార్డును హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.
అవార్డు అందుకున్న అనంతరం కంతి ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. సమాజ సేవలో, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని, ఈ గుర్తింపు తన సేవా ప్రయాణానికి మరింత స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కంతి ప్రవీణ్‌కు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘ నాయకులు అభినందనలు తెలియజేశారు. కన్నెబోయినగూడెం గ్రామానికి చెందిన కంతి ప్రవీణ్, సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేశారు.








