నర్మెట్ట, జూలై 31
వెల్దండ గ్రామ పంచాయతీలో సుమారు 30 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసి, అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందిన గొల్కొండ మల్లయ్య(55) కుటుంబానికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అండగా నిలిచారు. పలువురు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.
మండలంలోని వెల్దండ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న గొల్కొండ మల్లయ్య(55) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందాడు. సుమారు ముప్పై సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించిన మల్లయ్య కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ముందుకు వచ్చారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తరపున సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కంతి అంజనేయులు రూ. 5వేలు ఆర్థిక సహాయం అందించారు. గ్రామ పంచాయతీ నుండి రూ. 5వేలు, వార్డు సభ్యులు రూ. 5వేలు ఆర్ధిక సహాయం అందించారు. అదేవిధంగా గ్రామస్తులంతా కలిసి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కంతి ఆంజనేయులు, వార్డు సభ్యులు పిట్టల కృష్ణమూర్తి, చెవుల ఓజాలు, గూటం విష్ణూ, గూటం చంద్రయ్య, బొల్లం అవినాష్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కొన్నె సంపత్, నాయకులు బుస్సి కర్ణాకర్రెడ్డి, కల్యాణం సిద్దిరాములు, శాఢ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.









