బచ్చన్నపేట్, 2026-09-01
బచ్చన్నపేట మండల ఫోటోగ్రాఫర్ సంఘ సభ్యుడు దూడం మహేష్ ప్రమాదవశాత్తు జారిపడటంతో కాలు విరిగింది. ఈ విషయం తెలుసుకున్న తోటి ఫోటోగ్రాఫర్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి, మహేష్‌కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.
బచ్చన్నపేట మండల ఫోటోగ్రాఫర్ సంఘ సభ్యుడు దూడం మహేష్ ప్రమాదవశాత్తు జారిపడటంతో కాలు విరిగింది. ఈ విషయం తెలుసుకున్న తోటి ఫోటోగ్రాఫర్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి, మహేష్ కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.
మహేష్ కు అండగా నిలిచేందుకు ఫోటోగ్రాఫర్ సభ్యులందరూ కలిసి రూ.11,600/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన మహేష్ కుటుంబానికి తమ వంతు సహకారం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన మహేష్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తన వృత్తిని కొనసాగించాలని ఫోటోగ్రాఫర్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా ఫోటోగ్రాఫర్ సంఘ సభ్యుల మధ్య ఉన్న ఐక్యత, పరస్పర సహకారం మరోసారి చాటి చెప్పారు.









