ఆగాపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికపై గ్రామ సభ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆగపేట గ్రామ సర్పంచ్ డాక్టర్ పగిడిపాటి రాజు అధ్యక్షతన శనివారం ఆజరిగింది.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. గ్రామ ప్రజల అవసరాలు, అభివృద్ధి ప్రాధాన్యతలు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై గ్రామ ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ పగిడిపాటి రాజు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలం. ప్రతి కుటుంబం అవసరాలను పరిగణనలోకి తీసుకుని వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది అని తెలిపారు.
గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ గ్రామ సభలో ఉపసర్పంచ్ సోఖం అనిల్, పంచాయతీ కార్యదర్శి పూల శ్రీకాంత్, వార్డ్ సభ్యులు, అధికారులు, మహిళలు, యువత, గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.









