రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్మెట్ట మండల వ్యవసాయ అధికారిణి బి. మమత గారు మండలంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా దుకాణాల్లోని లైసెన్స్, స్టాక్ రిజిస్టర్లు, సోర్స్ సర్టిఫికేట్ (ఫారం-ఓ) ను పరిశీలించారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ పీ కే గ్రాన్యులేటెడ్ మిక్చర్లకు ఎటువంటి చెల్లుబాటు అయ్యే తయారీ లైసెన్స్ లు లేవని ఆమె తెలిపారు. ఒకవేళ అటువంటి స్టాక్ లు ఏ దుకాణంలో ఉన్నా వాటి సోర్స్‌ను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని ఆమె పేర్కొన్నారు. అనధికార స్టాక్ ఉంటే తక్షణమే డిటెన్షన్ నోటీసు ఇచ్చి శాంపిల్స్ సేకరిస్తామని, అలాగే కల్తీ ఎరువులు తయారు చేసినట్లు తేలితే పోలీసుల సహాయంతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
రైతులు అధిక ధరలకు ఎరువులు కొనవద్దని, బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నకిలీ, నాసిరకం ఎరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా ఫిర్యాదులు ఉంటే మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
రైతులు అధిక ధరలకు ఎరువులు కొనవద్దని, బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నకిలీ, నాసిరకం ఎరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా ఫిర్యాదులు ఉంటే మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.