ప్రతి కుటుంబానికి కంటికి రెప్పలా కాపాడుకుంటా... కౌన్సిలర్ గోపగోని సుగుణాకర్ గౌడ్ ...
జనగామ, నవంబర్ 06: జనగామ జిల్లా కేంద్రంలో 18వ కౌన్సిలర్ గోపగాని సుగుణాకర్ ఆపదలో ఉన్న కార్మిక కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.జనగామ మున్సిపాలిటీలోని 18వ వార్డులో శానిటేషన్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న చింత నాగేష్ తండ్రి మృతి చెందిన విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సుగుణాకర్, నాగేష్ స్వగ్రామమైన పత్తి షాపూర్‌కు వెళ్లారు.
మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బాధిత కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.
కార్మికుల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, వారి కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ సందర్భంగా ఆయన చాటిచెప్పారు. కష్టకాలంలో తమను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్ గోపగాని సుగుణాకర్కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.











