జనగామ జిల్లా మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్, సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపగోని శ్రీధర్ గౌడ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించడంతో లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే గ్రామంలోని పలు వీధులు, కూడళ్లలో అభిమానులు ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేసి సందడి చేశారు. వివిధ వార్డుల్లో కేక్‌లు కట్ చేసి శ్రీధర్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. డప్పు చప్పుళ్లు, బాణాసంచా సందడి మధ్య వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా, గ్రామ పెద్దలు, అభిమానులు శాలువాలు కప్పి, పూలమాలలతో సన్మానించారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీధర్ గౌడ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఆయన జన్మదిన వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, తనపై గ్రామ ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకమే తనకు బలమని పేర్కొన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, నిరంతరం ప్రజాసేవలో ఉంటానని తెలిపారు. ఈ జన్మదిన వేడుకల్లో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా శ్రీధర్ గౌడ్ జన్మదిన వేడుకలు
Share:

సారాంశం
ప్రజల మధ్యలో జన్మదిన వేడుకలు
ముఖ్య విషయాలు
- జనగామ జిల్లా మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్, సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపగోని శ్రీధర్ గౌడ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
- గ్రామ ప్రజలు, అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
- ఉదయం నుంచే గ్రామంలోని పలు వీధులు, కూడళ్లలో అభిమానులు ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేసి సందడి చేశారు.
- మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా, గ్రామ పెద్దలు, అభిమానులు శాలువాలు కప్పి, పూలమాలలతో సన్మానించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
420ఆర్టికల్స్
1,05,056వ్యూస్










