మండలం సన్నూరు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనుల పురోగతిపై పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద గారితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమీక్ష సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ సత్య శారద గారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎస్డీఎఫ్ () నిధుల కింద రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన నిర్మాణ పనుల వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులన్నింటినీ నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా 111.08 111.08 అడుగుల విస్తీర్ణంలో కోనేరును నిర్మించేందుకు రూ.261.89 లక్షలు, అనివెట్టి మండపం నిర్మాణానికి రూ.57.28 లక్షలు, శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ.15.94 లక్షలు, 1,344 అడుగుల ప్రాకార గోడ నిర్మాణానికి రూ.242.24 లక్షలు, పోర్టికో మండపం నిర్మాణానికి రూ.39.89 లక్షలు కేటాయించారు. అదేవిధంగా శివాలయ నిర్మాణానికి రూ.120 లక్షలు, ఆలయ సుందరీకరణ పనులకు రూ.60 లక్షలు కేటాయించారు.
ఇప్పటివరకు అనివెట్టి మండపం, పోర్టికో మండపం, ప్రాకార గోడ, ఔటర్ ప్రాకార గోడ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే అనివెట్టి మండపం, పోర్టికో మండపం సుందరీకరణ, ప్రాకార గోడ ప్రవేశ ద్వారాల నిర్మాణం, కోనేరు నిర్మాణం, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శివాలయ నిర్మాణ పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిపై ఎమ్మెల్యే కలెక్టర్‌తో ప్రత్యేకంగా చర్చించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
సన్నూరు శ్రీ స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని, ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి పనులను ప్రాధాన్యతగా తీసుకొని మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, మండల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచ్, ఆలయ ధర్మకర్తలు, ఆలయ అభివృద్ధి కమిటీ బాధ్యులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.








