సిద్దిపేటలో జరిగిన యువ టూరిజం జిల్లా స్థాయి పోటీల్లో నంగునూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రంగనాయకసాగర్ వద్ద జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు నగదు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం రంగనాయకసాగర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు రూ.12 వేల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్ హైమావతి, టూరిజం శాఖ జిల్లా అధికారి విజయ్ భార్గవ విద్యార్థులను అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన నంగునూరు పాఠశాల యువ టూరిజం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వం, పర్యాటక ప్రదేశాలపై విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎర్రన్నగారి రాంగోపాల్‌రెడ్డి గైడ్ టీచర్‌గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.












