నర్మెట్ట, ఆగస్టు 1
పెండింగ్లో ఉన్న ఫీజు, రియింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేవైయం నాయకుడు పులి కపిల్ఆదిత్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కపిల్ఆదిత్య మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి సుమారు రూ.15వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలో వేలాది పేద, మద్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిందని అన్నారు.
ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేనిచో విద్యార్థుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థులు మహేష్, రంజిత్, రమేష్, సంపత్, ఆరవింద్, రాజు, తదితరులు పాల్గొన్నారు.