కేంద్రాలను (ఓరుగల్లు న్యూస్) సెప్టెంబర్ 13
హనుమకొండ జిల్లాలో ఈ నెల 13న జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి శనివారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలను సమీక్షించారు.
హనుమకొండలో ఎన్డీఏ, సీడీఎస్ పరీక్ష కేంద్రాల పరిశీలన హనుమకొండ జిల్లాలో ఈ నెల 13 (ఆదివారంన )జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ (ఎన్డీఏ, ఎన్ఏ)-2, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్)-2 పరీక్షలను నిర్వహించే పరీక్షా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి శనివారం పరిశీలించారు. హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి బాలికల డిగ్రీ, పీజీ కళాశాలలను అదనపు కలెక్టర్ రవి, కేంద్ర పరిశీలకులు ఉమేష్ కుమార్ మీనా సందర్శించి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా గదులు, అభ్యర్థులకు కల్పిస్తున్న తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ తదితర ఏర్పాట్లను వారు పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా జరిగేవిధంగా బాధ్యతలు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి,అడిషనల్ తహసీల్దార్లు రవి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.









