నర్మెట్ట, 7 September
డహడడీఎఎఉధశీ.()థఉఉధ.ధృషణఆఈడ.
విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తూ ఉత్తమ సేవలందించిన మండలం మచ్చుపహాడ్ జడ్పీఎస్ఎస్కు చెందిన ఉపాధ్యాయురాలు శ్రీమతి Ch. జ్యోతి (SGT) జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లింగాల హైమా రమేష్ ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జ్యోతి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ లింగాల హైమా రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జ్యోతి సాధించిన ఈ పురస్కారం మచ్చుపహాడ్ గ్రామానికి, పాఠశాలకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాకయ్య, వార్డు సభ్యుల ఫోరం మండల ఇన్చార్జి గుండేటి రామచందర్ గౌడ్, గొల్లపల్లి కుమారస్వామి, ఉపాధ్యాయులు దయాసాగర్ తదితరులు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయురాలు జ్యోతికి అభినందనలు తెలిపారు.









