న్యూఢిల్లీ, తెలంగాణ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 15
ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. తెలంగాణలో కరువు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం కోరారు.
ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ లోని ఆయన నివాసంలో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల తెలంగాణలో ఏర్పడిన కరువు, వర్షాభావ పరిస్థితులపై ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల తక్షణ ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు.
ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై చర్చ
తెలంగాణ ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించాలని, గోదావరి-కావేరి నదుల అనుసంధానం, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని ప్రధానిని సీఎం కోరారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియాకు ఆహ్వానం
హైదరాబాద్ వేదికగా జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభోత్సవానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని ఆహ్వానించారు.






