నర్మెట్ట, 17 November
డీసీ తండా సర్పంచ్ సర్పంచ్ అరుణ సంతోష్
వికసిత్ భారత్ - జీ రామ్ జీ పనులను సద్వినియోగం చేసుకోవలని దొంగల చెలిమే తండా సర్పంచ్ అరుణ సంతోష్ అన్నారు. మండలంలోని డీసీ తండా గ్రామంలో ఈ పథకం కింద చేపట్టిన ఫామ్ పాండ్ (వ్యవసాయ క్షేత్ర పనులు) పనులను సర్పంచ్ నూనావత్ అరుణ-సంతోష్ పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల్లో పాల్గొంటున్న ఉపాధి కూలీలతో ఆమె మాట్లాడారు. పనుల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అధిక సంఖ్యలో కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొనడం ద్వారా గ్రామానికి మరిన్ని అభివృద్ధి పనులు, మెటీరియల్ కాంపోనెంట్ పనులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా గ్రామ అభివృద్ధికి మరింత తోడ్పాటు లభిస్తుందని ఆమె అన్నారు.
గ్రామంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగపడే నిర్మాణాలను ప్రోత్సహిస్తామని, కూలీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అంజలి, ఉపసర్పంచ్ రాజేశ్వరి-మోతిలాల్, వార్డు సభ్యులు కిషన్, సురేష్, మాజీ ఉపసర్పంచ్ రవి, భోజ్య, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.







