చేర్యాల, 2026-11-23
గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు మెంబర్లకు ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేట ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు మెంబర్లకు ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేట ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ముక్క అనిల్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వార్డు మెంబర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిరంతరం ప్రజాసేవ చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ, పాలనా వ్యవస్థలో తమకు తగిన గుర్తింపు, గౌరవం, కనీస సౌకర్యాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నెలవారీ గౌరవ వేతనం: ప్రతి వార్డు మెంబర్కు వారి సేవలను గుర్తిస్తూ నెలవారీ గౌరవ వేతనం మంజూరు చేయాలి. శిలాఫలకాలపై పేరు: గ్రామ పంచాయతీలు, వార్డుల పరిధిలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి సంబంధించిన శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలపై ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత వార్డు మెంబర్ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా: పదవీకాలంలో ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో వార్డు మెంబర్ మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించి ఆర్థిక భరోసా కల్పించాలి. ప్రత్యేక ఆరోగ్య కార్డులు: వార్డు మెంబర్లు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేయాలి. అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం: గ్రామసభలు, తీర్మానాలు, నిధుల కేటాయింపులు, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో వార్డు మెంబర్ల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ పూర్తి భాగస్వామ్యం కల్పించాలి. ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ముక్క అనిల్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గద్దె రాజు, చేర్యాల మండల అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి, చిన్నకోడూరు మండల అధ్యక్షుడు శ్రావణ్ గౌడ్, దూల్మిట్ట మండల అధ్యక్షుడు పూర్ణచందర్ గౌడ్, అక్కన్నపేట మండల అధ్యక్షుడు సతీష్, తొగుట మండల అధ్యక్షుడు గొడుగు శ్రీశైలం, జిల్లా నాయకులు నాని, బాబు, నవీన్, నాగరాజు, నర్సింలు, జిల్లా వార్డు మెంబర్లు యాదగిరి, శ్రీకాంత్, శేఖర్, నరేష్, వైకుంఠం, ప్రవీణ్, మధుసూదన్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.







