Medchal-Malkajgiri, 2026-11-20
మేడ్చల్ జిల్లాలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ రావల్కోల్ వార్డు అధికారి రవీందర్ రెడ్డి రూ.30 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
మేడ్చల్ జిల్లాలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై కొరడా ఝళిపించారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రావల్కోల్ వార్డు అధికారి రవీందర్ రెడ్డి రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
ఆస్తి అంచనా పనికి సంబంధించి బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో వార్డు అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం ఎల్లంపేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టి, కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.







