జనగామ, 14 November
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో జనగామలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ నేచర్ రన్ ఫర్ ఫ్యూచర్ పేరుతో 5 రన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువత, అధికారులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వాస్విక్ ఫౌండేషన్ తన ఆరు సంవత్సరాల సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రన్ ఫర్ నేచర్ రన్ ఫర్ ఫ్యూచర్ పేరుతో 5 రన్ కార్యక్రమాన్ని జనగామలో ఘనంగా నిర్వహించింది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ పరుగుల కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, పట్టణ సీఐ సత్యనారాయణ రెడ్డి, వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువత, పెద్దలు, వాకర్స్, రన్నర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం 5 రన్లో ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతి ప్రసాదించే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని, భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ, నీటి వనరులను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.
ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఫౌండేషన్ తన ఆరు సంవత్సరాల సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ఏడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్లానెట్ 5 రన్ నిర్వహించినట్లు తెలిపారు. రన్ ఫర్ వాటర్, రన్ ఫర్ ఎర్త్, రన్ ఫర్ ఎన్విరాన్మెంట్, రన్ ఫర్ ఎడ్యుకేషన్, రన్ ఫర్ హెల్త్ అనే ఐదు ప్రధాన లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక దృఢత్వం కోసం పరుగులు, యోగా వంటి కార్యక్రమాలను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగల పౌరులుగా అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. వాస్విక్ ఫౌండేషన్ నిరంతరం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆమె అభినందించారు. పట్టణ సీఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాలుగా వాస్విక్ ఫౌండేషన్ అనేక వినూత్న సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతోందని తెలిపారు. రోడ్డు భద్రత కోసం బారికేడ్లు అందిస్తూ, ప్రమాదాల నివారణకు, విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు. గ్రీన్ మిషన్లో భాగంగా నిరంతరం మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ 5 రన్ గొప్ప కార్యక్రమమని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సేవా సైనికులు మహేందర్ వర్మ, నూకల నర్సిరెడ్డి, రమేష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, వేలాద్రి, యాకూబ్, వికాస్ రెడ్డి, నవీన్, శ్రీశైలం, పీడీ చందు, పీడీ కిషన్, రాంరెడ్డి, ఆర్.కె., సాయికిరణ్ రెడ్డి, నరేష్, రాజు, డీజే అశోక్ తదితరులతో పాటు వాకర్స్ అసోసియేషన్, రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, వైద్యులు, పోలీసులు, క్రీడా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వాస్విక్ ఫౌండేషన్ ఏడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పలువురు ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని వారు ఆకాంక్షించారు.






