మండలం ఇప్పలగడ్డ గ్రామపంచాయతీలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధరావత్ రాజమణి (రాజు నాయక్) లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇట్టబోయిన సురేష్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఇట్టబోయిన శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బండి కనకయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బండి మోహన్, ఇట్టబోయిన ప్రతాప్, ఇట్టబోయిన కనకరాజు, బండి వెంకన్న, బానోత్ రాజు, ఇట్టబోయిన స్వామి, బండి రాజు, మేకల మల్లేష్,ద్దుల నరసింహులు, బానోత్ రాజేందర్, బానోత్ బాలు, బండి నరసింహులు, బండి సిద్ధులు, ఇట్టబోయిన వీరయ్య, గ్రామ సిబ్బంది వద్దుల కర్ణాకర్, గ్రామ పెద్దలు, యువకులు మహిళలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.












