మద్దూరు మండలంలోని నర్సాయపల్లిలో ప్రత్యేక గ్రామసభ.. అభివృద్ధి పనులపై విస్తృత చర్చ
మహాత్మా గాంధీ జయంతిని మండలంలోని నర్సాయపల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, నర్సాయపల్లి సర్పంచ్ శనిగరం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక సమస్యలపై గ్రామసభలో విస్తృతంగా చర్చించి, పలు కీలక తీర్మానాలు చేశారు.
నర్సాయపల్లిని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. 16వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ అవసరాలకు అనుగుణంగా వినియోగించేందుకు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ()ను రూపొందించాలని తీర్మానించారు. అలాగే, - పథకం కింద చేపట్టే అభివృద్ధి పనుల్లో ఇంకుడు గుంతలు, డ్రైనేజీలు, కమ్యూనిటీ సోక్పిట్లు, బోర్వెల్ రీచార్జ్ సోక్పిట్లు, ఫారం పాండ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. పథకం ద్వారా గ్రామీణ నివాస ప్రాంతాల్లో డ్రోన్ ఆధారిత సర్వే, ఆస్తుల మ్యాపింగ్ నిర్వహించే విధానంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణంతో పాటు జెడ్పీహెచ్ఎస్లో కిచెన్ షెడ్ నిర్మాణం చేపట్టాలని గ్రామసభలో నిర్ణయించారు.
గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ నర్సాయపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సర్పంచ్ సత్యనారాయణ తెలిపారు.











