నర్మెట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం యొక్క మండల కమిటీని, జిల్లా అధ్యక్షులు శ్రీ నల్గొండ మహేందర్ గారి ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ మండల అధ్యక్షులుగా జంగిటి ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా బత్తుల నరేందర్, బత్తుల కర్ణాకర్, పోతిరెడ్డి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా చల్లా వెంకటేష్, కార్యదర్శులుగా కాశెట్టి బాల నరసింహులు, కొండేటి రాజు, కోశాధికారిగా పగడాల భరత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులుగా పగడాల నర్సయ్య గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నల్గొండ మహేందర్ గారు మాట్లాడుతూ, మున్నూరు కాపులు దేశానికి అన్నం పెట్టే వారని, వారి సంఘటిత శక్తి సమాజానికి అవసరమని అన్నారు. కావున మున్నూరు కాపు బిడ్డలందరూ ఐక్యంగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించుకొని, సమాజానికి ఆదర్శ రైతులుగా నిలవాలని కోరారు.
అదేవిధంగా, మండల అధ్యక్షులుగా ఎన్నికైన జంగిటి ఆంజనేయులు గారు మాట్లాడుతూ, నర్మెట్ట మండలంలోని మున్నూరు కాపు కులస్తులందరూ సోదర భావంతో మెలగాలని, కుల సభ్యుల మధ్య సమస్యలను పరిష్కరించుకొని, సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.











