మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ముందుగా మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బోయిన శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు జీడికంటి సురేష్, తోడంగుల భాస్కర్, మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్, మండల డైరెక్టర్ కాటం బాలయ్య, కార్యదర్శులు ఇక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, చిలుక రాంబాబు, ఒగ్గు రవి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సుందరగిరి బాలకృష్ణ, టౌన్ గ్రామశాఖ అధ్యక్షుడు బూరుగు రాజు గౌడ్, నర్సాయపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు ముస్యాల బాబు, లగ్నూర్ గ్రామశాఖ అధ్యక్షుడు పూల కనకయ్య, వార్డు సభ్యులు ఎర్రబచ్చల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.












