మండలంలోని నర్మెట్ట, హనుమంతపూర్, బొమ్మకూర్ గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించడం లేదని బొమ్మకూర్ లో పలువురు నాయకులు ఐకెపి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
తెలంగాణలో మహిళలు బతుకమ్మ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజునే ఐకెపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం మహిళలకు అసౌకర్యంగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామానుజ చారి, సర్పంచుల జిల్లా అధ్యక్షుడు గోపగోని శ్రీధర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు పండుగ జ్యోతి రమేష్, భూక్యా భుజ్జమ్మ చందర్, చేర్యాల మార్కెట్ డైరెక్టర్ కన్నెబోయిన రామకృష్ణ, మాజీ ఎంపీపీ గోవర్ధన్, నాయకులు ప్రజ్ఞాపురం శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.









