Jangaon/Tharigoppula (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 14
బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారి విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అక్కరాజుపల్లి గ్రామ సర్పంచ్ మంచినీళ్ల రాజు అన్నారు.నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బాలల ప్రత్యేక గ్రామసభలో సర్పంచ్ మంచినీళ్ల రాజు మాట్లాడారు.
పిల్లలు, తల్లిదండ్రులకు బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, బాల్యవివాహాల నిర్మూలన, అక్రమ రవాణా నివారణ, బాలల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు.
చిన్నతనం నుంచే చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగవచ్చని సర్పంచ్ మంచినీళ్ల రాజు వివిధ ఉదాహరణలతో వివరించారు. బాలల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవల్లిక, ఉపసర్పంచ్ ఆకుల సురేష్, వార్డు సభ్యులు మేకల జ్యోతి రాజు, కేశం అనూష లక్ష్మణ్, మంచినీళ్ల సుజాత వెంకటస్వామి, కందారపు సంపత్, పలుచని జ్యోతి రాజు, బండ రమేష్, భోగం అనూప్ కుమార్, కారోబార్ అక్తర్, అంగన్వాడీ టీచర్లు మినుకూరి రమ, పలుచని రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ బండ ప్రసాద్, గ్రామ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.






