కొండపాక్, 15 November
మండలం దుద్దెడ గ్రామపంచాయతీలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక బాలల సభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్, పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలల హక్కులు, విద్యాభివృద్ధి, సంక్షేమం, చిన్నారుల భవిష్యత్తుపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేలా ప్రోత్సహించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






