చిన్నకోడూరు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 24
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చిన్నకోడూరు ఎంఆర్ఓ సలీం కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించి, దాని ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంఆర్ఓ సలీం మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కుటుంబ యజమాని ఆకస్మికంగా మరణించినప్పుడు, ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ బీమాను అందిస్తోందని, కావున ప్రతి కుటుంబ యజమాని దీనిని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జనార్ధన్, కార్యదర్శి నాగరాజు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.