మద్దూరు, 2026-11-23
సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, ఏఈ ప్రవళికతో కలిసి గేటు వాల్వులు బిగించే పనులు పరిశీలించారు
మర్మాముల గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో లీకేజీలు, పలు వార్డుల్లో నీటి సరఫరా సరిగా అందని ప్రాంతాలను గుర్తించి, వాటిని సరిచేసేందుకు గ్రామ సర్పంచ్ శ్రీ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. మండల మిషన్ భగీరథ ఏఈ ప్రవళికతో కలిసి గేటు వాల్వులు బిగించడం, తగు సూచనలు చేయడం వంటి పనులు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.







