నారాయణపేట, 9 September
ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి రూ.90 వేల లంచం డిమాండ్ చేసిన జిల్లా గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకటస్వామి, మధ్యవర్తి కమ్మరి నాగేశ్‌లను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. వీరిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.90 వేల లంచం: ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు రూ.90 వేల లంచం డిమాండ్ చేసిన జిల్లా గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకటస్వామితో పాటు, మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి కమ్మరి నాగేశ్‌లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఒక ఫిర్యాదుదారుడి ఇంటి రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి సబ్ రిజిస్ట్రార్ రూ.90 వేలు లంచం అడిగారు. ఇందులో భాగంగా న ఓ మెస్ యజమాని అయిన నాగేశ్ ద్వారా రూ.50 వేలను ముందస్తుగా తీసుకున్నారు. మిగిలిన రూ.40 వేల కోసం మళ్లీ ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లంచం వసూలు చేసినందుకు నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వీరిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.










