కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 26
కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘం నాయకులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే పునాది అని, ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను రాజ్యాంగం అందించిందని తెలిపారు. రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.







