అర్హులైన జర్నలిస్టులకు పింఛన్ పథకం వర్తించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.
రఘునాథపల్లి మండలం నీడిగొండలో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం సందర్భంగా, తెలుగు ప్రభ జనగామ స్టాఫ్ రిపోర్టర్ సుంకరి బిక్షపతి నేతృత్వంలో జర్నలిస్టులు కడియం శ్రీహరిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ, సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జర్నలిస్టులకు పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ఇర్రి మల్లారెడ్డి, సాక్షి బిక్షపతి, పి.వెంకటస్వామి, తిప్పారపు ఉపేందర్, బూస రమేష్ యాదవ్, భాస్కర్, కుంభం రమేష్ యాదవ్, కిరణ్, సాగర్, సాయి, సుధాకర్, ఉపేందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.







