సిద్దిపేట, 18 November
ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో సిద్దిపేట నగరం పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంది. సుమారు 10 వేల మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించాయి.
సీఎం సభ నేపథ్యంలో సిద్దిపేట నగరం పోలీసుల వలయంలోకి వెళ్లింది. సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. సభ నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందింది.
సీఎం సభ పట్ల సిద్దిపేట ప్రజల్లో విముఖత వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్‌కు ఇంటెలిజెన్స్ నివేదిక చేరింది. ఏదేమైనా సభ నిర్వహించాల్సిందేనని సీఎం రేవంత్ పట్టుబట్టారు. జిల్లాల నుంచి వేలాదిగా ప్రజలను సమీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయాలని ఆదేశించారు. పోలీసుల భారీ మోహరింపుతో సిద్దిపేట ప్రజల్లో ఆందోళన నెలకొంది.







