సారాంశం
లంబాడ హక్కుల పోరాట సమితి జనగామ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా ఆయన రైతులను కలిసి, ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- 2రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు అందుబాటులో ఉండి, కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆయన సూచించారు.
- 3ఆలస్యం లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వం, సంబంధిత అధికారులను కోరారు.
- 4వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలి
రఘునాథపల్లి మండలంలోని ఆంధ్ర తండా గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని లంబాడ హక్కుల పోరాట సమితి జనగామ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్ సందర్శించారు.
రఘునాథపల్లి మండలంలోని ఆంధ్ర తండా గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని లంబాడ హక్కుల పోరాట సమితి జనగామ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను కలిసి, ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు అందుబాటులో ఉండి, కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఆలస్యం లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వం, సంబంధిత అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూక్య శ్రీను నాయక్, గ్రామ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.