తెలంగాణ ఉప సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా మండలానికి చెందిన కోల శ్రీధర్ గౌడ్ నియమితులయ్యారు. ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.రాష్ట్ర రాష్ట్రంలోని ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని శ్రీధర్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ ఉప సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన కోల శ్రీధర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.రాష్ట్రరాష్ట్ర స్థాయిలో ఫోరం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రాష్ట్రంలోని ఉప సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఫోరం నాయకులు ఆకాంక్షించారు. నియామక పత్రాన్ని అందుకున్న అనంతరం కోల శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన అధ్యక్షుడు బొట్ల కార్తీక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీల ఉప సర్పంచులను సమన్వయం చేసుకుని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
గ్రామపంచాయతీల పరిపాలనలో ఉప సర్పంచులకు ఉన్న బాధ్యతలు, ప్రాధాన్యతపై అవగాహన కల్పించడంతో పాటు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత వేదికలపై ప్రస్తావిస్తానని తెలిపారు. ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను మండల, జిల్లా స్థాయిలో సేకరించి వాటిని స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని శ్రీధర్ గౌడ్ పేర్కొన్నారు.గ్రామాల అభివృద్ధిలో సర్పంచులతో కలిసి ఉప సర్పంచులు సమన్వయంతో పనిచేసేలా ప్రోత్సహిస్తానని అన్నారు. ఫోరం ఫోరం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని ఉప సర్పంచులు, ఫోరం నాయకుల సహకారం తీసుకుంటానని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించి ఉప సర్పంచ్‌లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.తన నియామకానికి సహకరించిన ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్‌తో పాటు ఫోరం నాయకులు, రాష్ట్రంలోని ఉప సర్పంచ్‌లకు శ్రీధర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా తన నియామకం పట్ల పలువురు నాయకులు, ఉప సర్పంచులు ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.










