గ్రామ శివారులోని ఊర చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగు చూసింది. నర్మెట ఎస్సై నైనాల నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని హనుమంతపూర్ గ్రామానికి చెందిన శనిగరం మల్లేష్ (58) గ్రామంలోని తన సొంత ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో గ్రామ శివారులోని ఊర చెరువు వద్దకు వెళ్లి, చేపలు పట్టేందుకు చెరువులోకి దిగాడు. చెరువులో నీటి లోతు ఎక్కువగా ఉండటంతో, ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో అటుగా వెళ్తున్న గొర్రెల కాపరి మేక రామచంద్రం, మృతదేహం నీటిపై తేలుతూ ఉండటాన్ని గుర్తించి, మృతుడి కుమారుడు శనిగరం నరేష్‌తో పాటు గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని మల్లేష్ మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి కుమారుడు శనిగరం నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నైనాల నాగేష్ తెలిపారు.
చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి
Share:

సారాంశం
నర్మెట మండలం హనుమంతపూర్ గ్రామంలో విషాదకర సంఘటన
ముఖ్య విషయాలు
- శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో గ్రామ శివారులోని ఊర చెరువు వద్దకు వెళ్లి, చేపలు పట్టేందుకు చెరువులోకి దిగాడు.
- నర్మెట ఎస్సై నైనాల నాగేష్ తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని హనుమంతపూర్ గ్రామానికి చెందిన శనిగరం మల్లేష్ (58) గ్రామంలోని తన సొంత ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు.
- శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో అటుగా వెళ్తున్న గొర్రెల కాపరి మేక రామచంద్రం, మృతదేహం నీటిపై తేలుతూ ఉండటాన్ని గుర్తించి, మృతుడి కుమారుడు శనిగరం నరేష్‌తో పాటు గ్రామస్తులకు సమాచారం అందించాడు.
- గ్రామ శివారులోని ఊర చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగు చూసింది.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
366ఆర్టికల్స్
94,009వ్యూస్










