కొమురవెల్లి మండలంలోని అయినాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పబ్బోజు విజేందర్ కుమారుడు పబ్బోజు మురళి కార్తీక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం అర్ధరాత్రి కుషాయిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మురళి కార్తీక్ను సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మృతుడి నివాసానికి చేరుకుని, మురళి కార్తీక్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్న వయసులోనే మురళి కార్తీక్ మృతి చెందడం అత్యంత బాధాకరమని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి మనోధైర్యం కల్పించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శ
Share:

సారాంశం
- పాడే మోసిన ఎమ్మెల్యే
ముఖ్య విషయాలు
- కొమురవెల్లి మండలంలోని అయినాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పబ్బోజు విజేందర్ కుమారుడు పబ్బోజు మురళి కార్తీక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
- మంగళవారం అర్ధరాత్రి కుషాయిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మురళి కార్తీక్ను సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు.
- ఈ విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మృతుడి నివాసానికి చేరుకుని, మురళి కార్తీక్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

నాగపురి కిషన్
Reporter
Tharigoppula
9ఆర్టికల్స్
280వ్యూస్










