భద్రాచలంలో ప్రత్యేక పూజలు.. ఎమ్మెల్యేకు లడ్డూ ప్రసాదం అందజేత
జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త బైకాని బాలరాజు యాదవ్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బాలరాజు యాదవ్ నిర్వహిస్తున్న సామాజిక, పార్టీ కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో బాలరాజుకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. బాలరాజుకు సహకరిస్తున్న తోటి స్నేహితుడు నాగపురి కిషన్ గౌడ్ నిఎమ్మెల్యే అభినందించారు. పల్లా ఇచ్చిన ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్నిచ్చిందని బాలరాజు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.









