మండలంలోని హన్మంతాపూర్ గ్రామంలో ఇటీవల ఇళ్లు మంజూరైన ఏడుగురు లబ్ధిదారులకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంజూరు పత్రాలను అందజేశారు. గ్రామ సర్పంచ్ పండుగ జ్యోతి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పండుగ జ్యోతి రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆమెను శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగా రావు, తాజా మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ. గౌస్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కంతి రాజలింగం, బావండ్లపల్లి రాజు, గ్రామ ఉపసర్పంచ్ మూల కిరణ్ గౌడ్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు ఎల్లబోయిన నరేష్, వార్డు సభ్యులు కొర్ర పాపన్న, పన్నీరు విజయశాంతి, అరవింద్, ఇరుగు మానస కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు ఇట్టబోయిన రమేష్, విశ్వనాధుల ఆంజనేయులు, చల్లా రాంనర్సయ్య, పోతని కుమార్, రాయారపు రాజు, ఇరుగు క్రాంతి, లొంక శివ, తేజావత్ రఘు, నాగంపల్లి శ్రీకాంత్, పొనగంటి కుమార్, భూక్య సాయి, గ్రామస్థులు దూసరి హరిగోపాల్, ఇట్టబోయిన రాజు, ఇరుగు యాదగిరితో పాటు ఇళ్లు మంజూరు పొందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.












