బచ్చన్నపేట్, 2026-11-23
మండలంలోని పోచన్నపేట గ్రామంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహ్మద్ మాసుద్, గ్రామ సర్పంచ్ ఫిరోజ్‌తో కలిసి ప్రారంభించారు.
మండలంలోని పోచన్నపేట గ్రామంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహ్మద్ మాసుద్, గ్రామ సర్పంచ్ ఫిరోజ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇందిరమ్మ బీమా ఆపద సమయంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని, అర్హులందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఫాతరపు నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు అకిరెడ్డి శ్రీధర్, ఈర్ల శివరాములు, సిద్దులగుట్ట డైరెక్టర్ సీపాతి ప్రభాకర్, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా ఉపాధ్యక్షుడు నల్ల మహేందర్, మండల చైర్మన్ బొట్టు గణపతి, గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి సంగమళ్ల బాలస్వామి, వార్డు సభ్యులు సునీత, సతీష్, తాళ్లపల్లి బాబు, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు అనిల్, పంచాయతీ కార్యదర్శి అజీజ్ పాషా, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







