సిద్దిపేట, 11 November
జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 202627కు సంబంధించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన మొత్తం 418 ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభించబడి, ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి కె. లక్ష్మి కిరణ్ తెలిపారు. రైతులు ఎలాంటి అధైర్యానికి గురికావద్దని ఆమె సూచించారు.

జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించినట్లు ఆమె తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలులో ఎలాంటి జాప్యం జరగకుండా, రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే నాణ్యమైన ధాన్యాన్ని () నిబంధనల ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే సంచుల్లో నింపి, కేటాయించిన రైస్ మిల్లులు లేదా గోదాములకు ఎలాంటి జాప్యం లేకుండా తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించినట్లు పేర్కొన్నారు.
కావున రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని ఆమె కోరారు.