తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, నిత్య స్ఫూర్తి దాత డాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి వేడుకలు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అందెశ్రీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసిల్దార్ జి. దివ్య మాట్లాడుతూ, అక్షరానికి ఆత్మను, పాటకు ప్రజా చైతన్యాన్ని జోడించి తెలంగాణ అస్థిత్వానికి తన కలముతో ప్రాణం పోసిన మహాకవి అని, తెలంగాణ సమాజానికి, నేటి కవులకు, కళాకారులకు దిక్సూచి అని కొనియాడారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కవి, గాయకుడు పిన్నింటి రత్నం మాట్లాడుతూ, తన జీవితాన్ని కష్టాల కడలి నుండి కవిగా మార్చుకొని, ఎన్నో పాటలు రాసి ఉద్యమ సాహితీ శిఖరంగా ఎదిగారని, తెలంగాణ భాషను, యాసను, ఘోషను తన కలం, గలం ద్వారా సమాజ హితం కోసం శ్రమించి, పరితపించిన ప్రజాకవి అని, ఆయన నేటి కవులకు, కళాకారులకు మార్గ నిర్దేశకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిటి రాజేశం, గిర్దవర్ నరసింహులు, అన్ని గ్రామాల జిపిఓలు, కార్యాలయ సిబ్బంది, ప్రముఖ కళాకారుడు పిన్నింటి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాకవి అందెశ్రీ తెలంగాణ సాహిత్యానికి దిక్సూచి
Share:

సారాంశం
తహసిల్దార్ దివ్య
ముఖ్య విషయాలు
- తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, నిత్య స్ఫూర్తి దాత డాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి వేడుకలు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
- ముందుగా అందెశ్రీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసిల్దార్ జి.
- దివ్య మాట్లాడుతూ, అక్షరానికి ఆత్మను, పాటకు ప్రజా చైతన్యాన్ని జోడించి తెలంగాణ అస్థిత్వానికి తన కలముతో ప్రాణం పోసిన మహాకవి అని, తెలంగాణ సమాజానికి, నేటి కవులకు, కళాకారులకు దిక్సూచి అని కొనియాడారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
475ఆర్టికల్స్
1,17,835వ్యూస్




